పంచాయితీలు పెట్టినా కాపురం చక్కబడలేదు. మళ్లీ మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బొక్క మంతల పహాడ్‌కు చెందిన శివన్నారాయణ, శ్యామలకు ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగు సంవత్సరాల కుమార్తె ఉంది.
తరచూ గొడవల నేపథ్యంలో, కుమార్తెను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహంతో ఊగిపోయిన శ్యామల తండ్రి సూర్యనారాయణ, తల్లి యశోద, అన్న శివ శివ నారాయణ ఇంటికి వెళ్లి ఒక్కసారిగా వారిపై విరుచుకుపడ్డారు. అలాగే భర్త కుటంబంపై కళ్ళలో కారం కొట్టి కత్తులతో దాడి చేశారు భార్య కుటుంబీకులు.
శివన్నారాయణ అతని తండ్రి బిక్షమయ్య, తల్లి అచ్చమ్మ, అమ్మమ్మ నారమ్మ కళ్ళల్లో కారం కొట్టి కత్తులతో దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శివన్నారాయణ తల్లి అచ్చమ్మ మృతి చెందగా, మిగతావారంతా తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.