మహిళ పట్ల అసభ్య ప్రవర్తన... జవహర్ నగర్ సీఐపై బదిలీ వేటు

ఆదివారం, 24 డిశెంబరు 2017 (15:42 IST)
హైదరాబాద్, జవహర్‌నగర్ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ టీఎస్‌ ఉమామహేశ‍్వరరావుపై బదిలీ వేటుపడింది. ఓ హత్య కేసు నిమిత్తం ఓ మహిళ ఇంటికి వెళ్లిన ఆయన ఆమె పట్ల అసభ‍్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. 
 
సీఐపై సస్పెండ్ వేటు వేసి తక్షణం హైదరాబాద్ రేంజ్ డీఐజీకి రిపోర్టు చేయాలని రాచకొండ కమిషనర్‌ ఆదివారం ఆదేశించారు. హత్య కేసులో బాధితురాలి ఇంట్లో సీఐ ఉమామహేశ్వర్ అనుచితంగా వ్యవహరించారు. దీంతో తెలంగాణ పోలీసు శాఖ ఆయనపై చర్య తీసుకుంది. 
 
కాగా, లఘు చిత్ర దర్శకుడు యోగిపై కూడా మాదాపూరు డీసీపీ గంగిరెడ్డి కూడా అనుచితంగా ప్రవర్తించిన విషయం తెల్సిందే. నటి హారిక ఇచ్చిన ఫిర్యాదుతో స్టేషన్‌కు పిలిపించిన యోగిని విచారణ పేరుతో బూటు కాలితో తన్ని, చెంప పగులగొట్టిన విషయం తెల్సిందే. దీనిపై కూడా హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ విచారణకు ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు