రాంగ్ ‌రూట్‌లో వస్తే వీరబాదుడే.. భాగ్యనగరిలో ట్రాఫిక్ ఆంక్షలు కఠినతరం

సోమవారం, 28 నవంబరు 2022 (09:56 IST)
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్నారు. ముఖ్యంగా రాంగ్ రూట్‌లో వచ్చే వాహనచోదకుల నుంచి భారీగా అపరాధం విధించనున్నారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు సోమవారం నుంచి అమలు చేస్తు్నారు. రాంగ్‌రూట్‌లో వస్తే రూ.1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 చొప్పన వసూలు చేయనున్నారు. 
 
ఈ కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలు కోసం సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. రాంగ్‌ రూట్‌లో రావడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం తదితర కారణాల వల్ల ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు నిర్వహిచిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. 
 
దీంతో రాంగ్‌రూట్, ట్రిపుల్ రైడింగ్, సిగ్నలింగ్ జంప్స్ వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందులోభాగంగా రాంగ్ రూట్‌లో వచ్చే వాహనాలకు రూ.1700, ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1200 వరకు అపరాధం విధించనున్నారు. అలాగే, జీబ్రా లైన్ దాటిన వాహనానికి రూ.100, ఫ్రీలెఫ్ట్‌కు అడ్డంగా వాహనాన్ని నిలిపితే రూ.1000 ఫైన్ వేయనున్నారు. 
 
అందువల్ల ప్రతి ఒక్క వాహనచోదకుడు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించి, ప్రమాదాల నివారణకు సహకరించాలని ఈ సందర్భంగా అధికారులు విన్నవించారు. రూల్స్‌ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరి సహకారంతో హైదరాబాద్ నగరాన్ని ప్రమాద రహిత నగరంగా తీర్చిదిద్దుదామని ట్రాఫిక్ పోలీసులు పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు