దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్. షర్మిల తెలంగాణాలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించడం ఖాయమైపోయింది. ఆ దిశగా ఆమె ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అంశంపై ఆమె పలు జిల్లాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా, బుధవారం పలు విశ్వవిద్యాలయాలు, పాఠశాలల నుంచి వచ్చి వందలాది మంది విద్యర్థులతో హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసంలో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలుగు ప్రజలను దివంగత వైయస్సార్ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారన్నారు. ఆయన హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ద్వారా వెయ్యి రూపాయలు కడితే, మిగతా ఫీజును ప్రభుత్వం భరించేదని గుర్తుచేశారు. అప్పుడు చదువుకున్న ఎందరో విద్యార్థులు ఇప్పుడు పెద్దపెద్ద ఉద్యోగాలు చేస్తున్నారన్నారు.