ఈ నేపథ్యంలో గత నెల 29వ తేదీన ఇంట్లో పనులు చేస్తూ ఉన్నట్టుండి తలనొప్పింగా ఉందని చెప్పి కిందపడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సికింద్రాబాద్‌లోని సన్ షైన్ ఆస్పత్రికి తరలించగా, ఆమెను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్టు ప్రకటించారు.
జీవన్ దాన్ ప్రతినిధులు హరిత భర్త, ఇతర కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించడంతో వారు అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో హరిత కిడ్నీలు, కాలేయం, ఊపరితిత్తులు, నేత్రాలు సేకరించిన వైద్యులు... ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో నలుగురికి అమర్చారు. దీంతో హరిత చనిపోయినప్పటికీ.. ఆ నలుగురి రూపంలో ఆమె బతికే ఉంటుందని చెప్పారు.