ప్రధాని డిప్యూటీ సెక్రెటరీగా విశాఖ అమ్మాయి ఆమ్రపాలి..

ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (12:33 IST)
Amrapali
ప్రధాని డిప్యూటీ సెక్రెటరీగా తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారిణి కాట ఆమ్రపాలి నియామకం జరిగింది. విశాఖలో పుట్టి పెరిగిన ఆమ్రపాలి చెన్నై ఐఐటీలో ఐఐఎం చదివారు. బెంగళూరులో ఎంబీఏ పూర్తి చేసారు. 2010 యూపీఎస్సీలో ఆలిండియా 39వ ర్యాంక్‌ను సాధించిన ఆమ్రపాలి తెలంగాణ కేడర్ ఎంపికై  2013లో వికారాబాద్ సబ్-కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
 
కేంద్ర హోం శాఖా సహాయమంత్రి కిషన్ రెడ్డికి ప్రైవేట్ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహించిన ఆమ్రపాలి, ప్రధాని డిప్యూటీ సెక్రెటరీగా పదోన్నతి పొందారు. పనిలో ఎప్పుడూ చలాకీగా వుండే ఆమ్రపాలి అత్యంత సమర్థవంతం ఆఫీసరుగా పేరు తెచ్చుకున్నారు.
 
ఇకపోతే... కొత్తగా నియమితులైన ఐఏఎస్ అధికారుల్లో మధ్యప్రదేశ్ 2004 కేడర్‌కి చెందిన రఘురాజ్ రాజేంద్రన్, ఆంధ్రప్రదేశ్ 2010 కేడర్‌కు చెందిన అమ్రపాలి కాట, ఉత్తరాఖండ్ 2012 కేడర్‌కి చెందిన మంగేష్ గిల్దియాల్ ఉన్నారు. ఐఏఎస్ రఘురాజ్ రాజేంద్రన్‌ పీఎంవో కార్యాలయ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు