లంచం అడిగి.. ఆపై చెప్పుతో దాడిచేసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారినిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. ఘటన మారేడుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
లంచం అడిగిందని నిలదీస్తే ఇంటి వద్దే... నాపై చెప్పుతో దాడి చేసిన అధికారిని శిక్షించాలని బాధితుడు రాష్ట్ర మానవ హక్కుల సంఘం కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తన ఇంటి నిర్మాణంలో కంటోన్మెంట్ బోర్డ్ అధికారిని వేధింపుల నుండి రక్షణ కల్పించాలని కోరారు.
పికెట్‌కు చెందిన రామ్‌రెడ్డి లాల్ బజార్ విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేస్తున్నాడు. తన వంద గజాల ఇంటి నిర్మాణ అనుమతి కోసం లంచం ఇవ్వాలని లేదంటే... అడ్డుకుంటామని కంటోన్మెంట్ బోర్డ్‌లో సర్వేయర్ పనిచేస్తున్న సరిత వేధించిందన్నారు.
లంచం అడిగిందని నిలదీస్తే ఇంటివద్ద ఆ అధికారి నా పై చెప్పుతో దాడి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మారేడుపల్లి పోలీసు స్టేషన్లో కేసు పెట్టినప్పటికీ పట్టించుకోకపోవడమే కాకుండా... తనపైనే అక్రమ కేసును నమోదు చేశారని పేర్కొన్నారు.
కంటోన్మెంట్ అధికారుల నుండి రక్షణ కల్పించి.. దాడి చేసిన అధికారినిపై చర్యలు తీసుకోవాలని భాదితుడు మానవ హక్కుల కమిషన్‌ను వేడుకున్నారు.