తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో కూడా అమ్మాయిలదే పైచేయింగా నిలిచింది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు.
అలాగే, ద్వితీయ సంవత్సరంలో 59.21 శాతం మంది అబ్బాయిలు, 75.28 మంది అమ్మాయిలు ఉత్తీర్ణులయ్యారు. రెండు సంవత్సర ఫలితాల్లోనూ అమ్మాయిలో తమ హవాను కొనసాగించారు.
ఈ ఫలితాలను tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లేదా examresults.ts.nic.in వెబ్ సైట్లలోకి ఎంటరై ఫలితాలను చూసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.