హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని పశు సంక్షేమ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. గొల్ల, కురుమల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో 2017లో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించామన్నారు.
ఆ అప్పుకు సంబంధించి ఇప్పటిదాకా అసలు, వడ్డీ కలిపి 9 వాయిదాల్లో రూ.2,900.74 కోట్లు ఎన్‌సీడీసీకి చెల్లించామని స్పష్టం చేశారు. రెండో విడత అమలు కోసం లబ్ధిదారుల వాటా మినహాయించి రూ.4,593.75 కోట్ల రూపాయలు మంజూరు చేయాలన్న విజ్ఞప్తిపై ఎన్‌సీడీసీ అధికారుల బృందం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చి సంతృప్తి వ్యక్తం చేసినట్లు మంత్రి తెలిపారు.