చిత్తు కాగితాలు ఏరుకునే మహిళనూ వదలని కామాంధులు...

బుధవారం, 29 మే 2019 (09:04 IST)
కామాంధుల దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా చిత్తుకాగితాలు ఏరుతున్న మహిళపై అఘాయిత్యం జరిగింది. ఆమెపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. ఈ ఘటన తెలంగాణలో జనగామలో కలకలం సృష్టించింది. 
 
వివరాల్లోకి వెళితే.. చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే ఓ మహిళపై కొందరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమెను హత్య చేశారు. మృతదేహాన్ని మండలంలోని శామీర్‌పేట జాతీయ రహదారి పక్కన కల్వర్టు కింద పడేశారు. మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
విచారణలో మృతిచెందిన మహిళకు 14 ఏళ్ల క్రితం వివాహమైందని, ఆమెకు ఓ కుమార్తె కూడా ఉందని.. ప్రస్తుతం ఆమె భర్త మరో మహిళతో హైదరాబాద్‌లో ఉంటున్నట్టు తేలింది. మంగళవారం ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు