సినిమాలు చూసే రేప్ చేసామన్న జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్ నిందితులు

మంగళవారం, 14 జూన్ 2022 (12:04 IST)
హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో రోజుకో సంచలనం బయటపడుతోంది. నిబంధనల ప్రకారం పోక్సో కేసులో 60 రోజుల్లో నిందితులపై చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చార్జిషీట్‌లో పొందుపరచాల్సిన అంశాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు.  
 
ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో సన్నివేశాలే తమకు ప్రేరణ అని ఇద్దరు నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముగ్గురు మైనర్లు పోలీస్ కస్టడీలో ఉండగా.. వీరిలో ఒకరు ఘటనపై నోరు విప్పట్లేదని సమాచారం. మిగతా ఇద్దరి వద్ద పోలీసుల విచారణ కొనసాగుతోంది. 
 
పరీక్షలు ముగిశాక ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్న నేపథ్యంలో దాదాపుగా ప్రతీరోజు పబ్‌లకు వెళ్లడం నిందితులకు అలవాటుగా మారిందని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన మే 28న అమ్నీషియా పబ్‌కి వెళ్లగా.. అక్కడ ఇద్దరు బాలికలను పరిచయం చేసుకున్నారు. 
 
ఆ ఇద్దరు నవ్వుతూ మాట్లాడటంతో వారిని ట్రాప్ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఒక బాలికతో మాటలు కలిపి ఆమెను నమ్మించి వెంట తీసుకెళ్లారు. ఆపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. నిందితులంతా ముందుగా అనుకున్న తర్వాతే ఈ చర్యకు పాల్పడ్డారు.
 
ఈ కేసులో నిందితులైన సాదుద్దీన్ మినహా మిగతా ఐదుగురు మైనర్లంతా హైదరాబాద్ శివారులోని విద్యా సంస్థల్లో చదువుతున్నారు. వీరందరికీ ఓ కామన్ ఫ్రెండ్ ఉన్నాడు. అతని ద్వారానే వీరంతా తరచూ పబ్‌లకు వెళ్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు