అసహనంపై ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు: కవిత

బుధవారం, 2 డిశెంబరు 2015 (08:07 IST)
దేశంలో పెను ప్రకంపనలకు కారణమైన అసహనంపై కేంద్రం ఏమాత్రం సంతృప్తికరమైమన సమాధానం ఇవ్వలేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత పెదవి విరిచారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మత అసహనంపై ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదని ఢిల్లీలో కవిత వ్యాఖ్యానించారు. దేశంలో మత సామరస్యాన్ని పాదుకొల్పే దిశగా కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
 
ఇదే విధానంతో కేంద్రం ముందుకెళితే భవిష్యత్తులో వాతావరణం కలుషితమవుతుందని, పరిస్థితులు మరింత విషమించే ప్రమాదం లేకపోలేదని కవిత అన్నారు. బాధ్యతల నుంచి తప్పించుకునే దిశగా కేంద్రం వ్యవహరిస్తోందని కవిత ఆక్షేపించారు. విపక్షాల దాడిపై ప్రతిదాడి చేయాలన్న యోచనతోనే ముందుకు వెళుతున్నట్లుగా కేంద్రం వైఖరి ఉందని ఆమె ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి