కృత్రిమ అడవిని చూసి మురిసిన కెసిఆర్

గురువారం, 22 ఆగస్టు 2019 (08:23 IST)
తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్ధిపేటలోని కోమటిబండలో పర్యటించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లతో కలిసి ఆయన కోమటిబండలోని అటవీ ప్రాంతాన్ని సందర్శించారు.

కోటికిపైగా మొక్కలను నాటి అక్కడ కృత్రిమ అడవిని ప్రభుత్వం సృష్టించింది. ఇప్పుడు ఆ అడవి అందరిని ఆకట్టుకుంటోంది. ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నది.

సిద్ధిపేట తరహాలోనే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా అలానే కృత్రిమ అడవులను సృష్టించేందుకు, తద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు తీసుకోవలసిన చర్యల గురించి.. మార్గదర్శకాల గురించి కోమటిబండలో కలెక్టర్ల సమావేశంలో కెసిఆర్ చర్చించబోతున్నారు. ఈ సమావేశానికి మంత్రులు కూడా హాజరయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు