టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్ మీదగా ట్యాంక్ బండ్‌లోని క్రేన్ నెంబర్ 4 వద్దకు ఈ శోభాయాత్ర చేరుకుంటుందని చెప్పారు. అనంతరం గణేశుడి నిమజ్జనం ఉంటుందని పేర్కొన్నారు.
హిందువుల పట్ల పక్షపాత ధోరణి: బండి సంజయ్
ఖైరతాబాద్ మహాగణపతిని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, నగర ప్రధాన కార్యదర్శి రామన్ గౌడ్, ఇతర నాయకులు దర్శనం చేసుకోవడం జరిగినది. బండి సంజయ్ మాట్లాడుతూ.. నవరాత్రులు ఎంతో సంతోషంగా ఉల్లాసంగా చేసుకోవాలని కోరారు.
రాష్ట్రప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని, హిందువుల పట్ల పక్షపాత ధోరణితో ఉందని, నిమజ్జన ఏర్పాట్లను కూడా పక్షపాత ధోరణితో ఏర్పాటు చేయడం చాలా దురదృష్టకరమని విమర్శించారు.