బ్రోకర్లతో ఉన్న సంబంధాలను అడ్డం పెట్టుకుని అనేక ప్రాంతాల నుంచి అమ్మాయిలను అక్రమంగా నగరానికి తీసుకొస్తున్నాడు. వారితో నిజాంపేటలోని కేటీఆర్ కాలనీతో పాటు జగద్గిరిగుట్ట, ఆల్విన్‌కాలనీ, శుభోదయ కాలనీల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.
ఈ సందర్భంగా రమేష్‌తో పాటు ఓ సెక్స్‌వర్కర్, ఇద్దరు విటులను అరెస్ట్ చేసిన బాచుపల్లి పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. రమేష్ ఇతర చోట్ల నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రాలపై కూడా నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు.