గతేడాది కరోనా కారణంగా 11 అడుగుల విగ్రహానికే పరిమితమైన నిర్వాహకులు ఈసారి 40 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పు, 28 టన్నుల బరువున్న వినాయకుడిని తీర్చిదిద్దారు.
ఖైరతాబాద్‌లో వినాయకుడిని ఏర్పాటు చేయడం ప్రారంభించి 65 ఏళ్లు నిండిన సందర్భంగా రెండేళ్ల క్రితం 65 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 10 గణేశ్ నవరాత్రులు ప్రారంభం కానుండగా, 19న నిమజ్జనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
కాగా, వినాయక చవితి నేపథ్యంలో హుస్సేన్ సాగర్‌లో నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి నిన్న పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ఇతర అధికారులు ట్యాంక్‌బండ్‌ను పరిశీలించారు.