రాజీవ్ చిలక తెరకెక్కించారు. ఇందులో ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ వ్యవధి 15 నిమిషాలుంటాయి. ఇది మన దేవతల్లో ప్రథమ పూజలు అందుకునే విఘ్నేశ్వరుడికి సంబంధించిన పండుగ వినాయక చవితి పురాణాన్ని తెలియజేస్తుంది. వినాయక చవితి ప్రాధాన్యతను తెలియజేసేలా ఈ సిరీస్ ఉంటుంది. వినాయకునికి ఏనుగు తలను ఎందుకు పెట్టారు, అలాగే తన తమ్ముడు కార్తికేయతో గణేశుడు ఎందుకు పోటీ పడి మూడుసార్లు మూల్లోకాలను ప్రదక్షిణాలు చేశారు. చంద్రుడికి, వినాయక చవితినాడు ఎందుకు శాపం పెట్టారు, రాక్షసరాజు గజాసురుడిని వినాయకుడు మధ్య యుద్ధం తదితర విషయాలన్నీ ఈ వెబ్ సిరీస్‌లో కథలాగా పొందుపరిచారు.
ఈ షో మన పురాణగాథ. దీన్ని సరికొత్తగా, చక్కటి విజువల్స్‌తో, మంచి సౌండ్, స్పెషల్ ఎఫెక్ట్స్‌తో రూపొందించారు. ఇది పిల్లలనే కాదు, పెద్దలను కూడా మెప్పిస్తుంది. మహా గణేశను కౌశిక్ కర్ర రచించగా, శ్రీనివాస శర్మా రాణి సంగీతాన్ని అందించారు. జి.డి.ఆర్.మోహన్, ఎ.గంగరాజ్ చరణ్ యానిమేషన్ డైరెక్టర్స్ వర్క్ చేశారు. టి.ఎ.కె.కుమార్ ఈ షోకు వాయిస్ డైరెక్టర్‌గా పనిచేశారు. మహా గణేశ తొలి పోస్టర్, సాంగ్‌ను మంగళవారం రోజున రాజీవ్ చిలక(గ్రీన్ గోల్డ్ యానిమేషన్, సి.ఇ.ఓ), అజిత్ ఠాకూర్(ఆహా, సి.ఇ.ఓ) విడుదల చేశారు.
గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సి.ఇ.ఓ రాజీవ్ చిలక మాట్లాడుతూ మన మూలాలకు కారణమైన పురాణాలను కథలుగా చెప్పాలనుకున్నాం. అప్పుడు మహా గణేశతో ఆహా కిడ్స్ ద్వారా మాకొక గొప్ప అవకాశం లభించింది. ఈ క్రమంలో ఆహాతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. మనం అందరూ వయసుతో పాటు పెరుగుతూ తద్వారా వచ్చిన జ్ఞానాన్ని పెంపొందించుకున్నాం. ఇప్పటికీ మనం చిన్నప్పుడు విన్న కథలు మనకు గుర్తుంటాయి. అలాంటి ఓ గొప్ప పురాణ కథ అయిన మహా గణేశను క్రియేట్ చేసే అవకాశం గ్రీన్ గోల్డ్‌కు లభించింది. మేం రూపొందించిన ఇతర షోలు ఎంత సక్సెస్ అయ్యాయో అంతే సక్సెస్‌ను ప్రేమను మహాగణేశకు అందిస్తారని భావిస్తున్నాం అన్నారు.
దీంతో పాటు 2డీ, 3డీ ఫార్మేట్స్‌లోని లైవ్ యాక్షన్ కథలు, సూపర్ హీరోల కథలను రూపొందించాలని ఆహా ప్లాన్ చేస్తుంది. ఆహా రీసెంట్‌గా తరగతి గది దాటి అనే క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరిని అందించిన ఆహా.. అమలాపాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రధారులుగా నటించిన అద్భుతమైన సైఫై థ్రిల్లర్ కుడిఎడమైతే వెబ్ సిరీస్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే క్రాక్, లెవన్త్ అవర్, జాంబిరెడ్డి, చావు కబురు చల్లగా, నాంది, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్, నీడ, కాలా, ఆహా భోజనంబు, వన్, చతుర్‌ముఖం వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్, వెబ్ షోస్‌ను 2021లో ప్రేక్షకులకు అందించింది ఆహా.