హైదరాబాద్‌లో ఎడ్వెంచర్‌ ట్రైల్‌ను నిర్వహించిన కెటీఎం

మంగళవారం, 9 ఆగస్టు 2022 (16:55 IST)
ప్రపంచంలో నెంబర్‌ 1, భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రీమియం మోటర్‌సైకిల్‌ బ్రాండ్‌ కెటీఎం, తమ కెటీఎం ఎడ్వెంచర్‌ ట్రయల్స్‌ను హైదరాబాద్‌లో ఆగస్టు 07, 2022 ఉదయం నిర్వహించింది. కెటీఎం యజమానులకు  సాహసోపేత బైకింగ్‌లోని అద్భుతాలను  పరిచయం చేయాలనే లక్ష్యంతో కెటీఎం ఎడ్వెంచర్‌ ట్రయల్స్‌ను నిర్వహించారు. ఒకరోజు పాటు నిర్వహించిన ఈ రైడ్స్‌ ద్వారా ఉత్సాహపూరితమైన ట్రయల్స్‌ను వారు అన్వేషించవచ్చు. ఈ నేచర్‌ ట్రయల్స్‌ను  అత్యంత ఖచ్చితత్త్వంతో ఎంపికచేశారు. వీటిని కెటీఎం  నిపుణులు  ప్రత్యేకంగా ఎంపిక చేశారు.
 
వీటి ద్వారా సమగ్రమైన సవారీ అనుభవాలను అందించడంతో పాటుగా అన్ని భౌగోళిక పరిస్థితులనూ అన్వేషించేలా ప్రాధమిక సవారీ పద్ధతుల పట్ల అవగాహన కల్పించే రీతిలో దీనిని నిర్వహించారు. ఈ ఎడ్వెంచర్‌ ట్రయల్స్‌ను రైడర్లకోసం వారి నగరాలకు సమీపంలో దాగిన రహస్య మార్గాలను కనుగొనే రీతిలో తీర్చిదిద్దారు. ఈ రైడ్స్‌ ద్వారా కెటీఎం యజమానులు తమ బైక్‌ల సామర్థ్యం, వాటి వైవిధ్యతను రోడ్డుపై మాత్రమే కాకుండా ఆఫ్‌రోడ్‌లో సైతం అర్ధం చేసుకోగలరు. కెటీఎం ఎడ్వెంచర్‌ ట్రయల్స్‌ను ప్రత్యేకంగా కెటీఎం ఎడ్వెంచర్‌ యజమానులు, వినియోగదారుల కోసం నిర్వహించారు. ఈ రైడ్స్‌లో పాల్గొనాలనే ఆసక్తి కలిగిన వినియోగదారులు తమ పేర్లను నమోదు చేసుకున్న డీలర్‌షిప్‌ల వద్ద నిర్ధేశించిన సమయంలో రావాల్సి ఉంటుంది.
 
కెటీఎం ఎడ్వెంచర్‌ ట్రయల్స్‌కు కెటీఎం నిపుణులు నేతృత్వం వహించారు. వీరంతా కూడా బహుళ భౌగోళిక ప్రాంతాలలో సైతం నైపుణ్యంతో బైక్‌ నడపడంలో నిష్ణాతులు. ఈ ట్రయల్స్‌ వెనుక మార్గనిర్ధేశకులుగా వారు ఉన్నారు. విభిన్న నైపుణ్యాలు కలిగిన రైడర్లు విజయవంతంగా ట్రయల్స్‌ పూర్తి చేయడంలో వీరు తోడ్పడ్డారు. హైదరాబాద్‌లోని కెటీఎం ఎడ్వెంచర్‌ ట్రయల్‌కు బిగ్‌ రాక్‌ డర్ట్‌ పార్క్‌ కు చెందిన నిపుణులు నేతృత్వం వహించారు. ఈ రైడ్‌ కెటీఎం హైటెక్‌ సిటీ వద్ద నుంచి ఆక్టోపస్‌ లేక్‌ వరకూ జరిగింది. పగటి పూట జరిగిన ఈ ట్రయల్‌లో కెటీఎం యజమానులకు అత్యంత కీలకమైన ఆఫ్‌రోడింగ్‌ నైపుణ్యావసరాలైనటువంటి  విజన్‌, బాడీ కంట్రోల్‌, బైక్‌ కంట్రోల్‌, మరోన్నో అంశాలను నేర్చే అవకాశం కల్పించారు. ఎడ్వెంచర్‌ బైక్స్‌ లో ఫీచర్లు అయినటువంటి ఎంటీసీ, ఆఫ్‌ రోడ్‌ ఏబీఎస్‌, కార్నరింగ్‌ ఏబీఎస్‌, క్విక్‌ షిఫ్టర్‌+ మొదలైన అంశాల పట్ల వివరణ, డిమాన్‌స్ట్రేషన్‌లను సైతం ట్రయల్‌ ఆఫర్‌ సమయంలో అందించడం  ద్వారా సవారీ వినోదం, అభ్యాస అనుభవాలను అందించారు.
 
ఈ సందర్భంగా సుమీత్‌ నారంగ్‌, అధ్యక్షులు (ప్రోబైకింగ్‌)-బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘ఎడ్వెంచర్‌ మోటర్‌సైక్లింగ్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకునే నూతన ఎడ్వెంచర్‌ మోటర్‌సైకిల్‌  యజమానులకు అత్యద్భుతమైన ప్రారంభంగా ఈ కెటీఎం ఎడ్వెంచర్‌ ట్రయల్స్‌ నిలుస్తాయి. ఈ అడ్వెంచర్‌ ట్రయల్స్‌ను  కెటీఎం నిపుణులు తీర్చిదిద్దారు. వీటిద్వారా సంపూర్ణమైన సవారీ అనుభవాలను గతంలో ఎన్నడూ చూడని ప్రాంతాలలో ప్రయాణించడం ద్వారా అందిస్తారు. కెటీఎం ఎడ్వెంచర్‌ ట్రయల్‌ హైదరాబాద్‌లో నగరవాసులు తారు రోడ్లతో పాటుగా మట్టి రోడ్లలోనూ ప్రయాణాలు చేశారు. మా లక్ష్యమెప్పుడూ కూడా మా వినియోగదారులకు అసాధారణ మెషీన్‌ను మా వినియోగదారులకు అందించడం. దీనితో పాటుగా ఈ తరహా కార్యక్రమాల ద్వారా వారిని సంపూర్ణమైన రైడర్లుగా మారుస్తున్నాము. ఇప్పటి వరకూ 10 వేల మందికి పైగా కెటీఎం యజమానులు పలు కెటీఎం ప్రో-ఎక్స్‌పీ యాక్టివిటీలలో పాల్గొనేలా ప్రోత్సహించగలిగామని వెల్లడించేందుకు సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు. కెటీఎం ఎడ్వెంచర్‌ ట్రయల్స్‌ను దేశ వ్యాప్తంగా పలు నగరాలలో రాబోయే కొద్ది నెలల్లో స్థిరంగా నిర్వహించనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు