పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... రంగారెడ్డి జిల్లాలోని రాంపల్లి అనే గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు గత ఏడు నెలలుగా తలసేమియాతో బాధపడుతూ వచ్చాడు. ఈ క్రమంలో బాలుడికి రక్తమార్పిడి చికిత్స కోసం తండ్రి విద్యానగరులోని బ్లండ్ బ్యాంకు నిర్వాహకులను స్పందించారు. ఆ తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి ఆ బాలుడికి రక్తమార్పడి చేస్తూ వచ్చారు.
ఈ విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి జరిపిన పరీక్షల్లో ఎపుడు కూడా హెచ్.ఐ.వి. పాజిటివ్‌గా రాలేదు. కానీ, తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా రావడంతో పోలీసులు బ్లడ్ బ్యాంకుపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.