కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీలా తెదేపా... కేటీఆర్ సెటైర్లు

ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (17:55 IST)
పిట్ట కథలు, పంచ్ డైలాగులే కేసీఆర్ ప్రచార అస్త్రాలు.. అదే స్టైల్లో తన ప్రసంగాలను కొనసాగిస్తున్నారు కేటీఆర్. మేము రైతు బంధువులం.. కాంగ్రెసోళ్లు రాబంధులు.. మీకు ఏ బంధం కావాలో తేల్చుకోవాలంటూ మొన్న నిజామాబాద్ బహిరంగ సభలో   ప్రసంగించారు కేటీఆర్. నేడు తెలంగాణ భవన్ వేదికగా మరో సైటర్ పేల్చారు. 
 
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది ఢిల్లీకి పోతది... టీడీపీకి ఓటు వేస్తే అమరావతికి పోతది. కోదండరాంకు ఓటు వేస్తే ఎటు పోతాదో తెల్వదంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించడంతో తెలంగాణ భవన్ కార్యకర్తల చప్పట్లతో మారుమ్రోగింది. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీ అయ్యిందని, విపక్షాల పొత్తుల విషయంలో ఏమైనా ప్రజల ప్రయోజనం దాగి ఉందా అని ప్రశ్నించారు కేటీఆర్.
 
కోదండరాంను ముష్టి మూడు సీట్ల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. తన తండ్రిలా ప్రత్యర్ధులు మీద పదునైన మాటల తూటాలు పేల్చడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు అంతా కేటీఆర్‌ను తమతమ నియోజకవర్గాల్లో ప్రచారం చెయ్యాలని రిక్వెస్ట్ చేస్తున్నారట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు