కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిని విమర్శించేస్థాయి ఎంపీ సుమన్‌కు లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి మండిపడ్డారు. గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)ని, పార్లమెంటును ఒప్పించింది జైపాల్‌రెడ్డేనని వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై స్పందిస్తూ... ఆయన అలా మాట్లాడటం తప్పు అన్నారు.
మరోవైపు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర నేతలపై శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీఎల్పీ నేత జానారెడ్డి తెలిపారు. పార్టీలో ఇలాంటి పరిణామాలకు బాధపడుతున్నానని జానా వెల్లడించారు. ఎవరికైనా భేదాభిప్రాయాలుంటే పార్టీలో చర్చించి, అధిష్ఠానానికి వివరించాలి తప్ప ఒకరినొకరు చులకనగా మాట్లాడుకోకూడదని వ్యాఖ్యానించారు. ఇది పార్టీ నష్టం.. వ్యక్తిగతంగా ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని.. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి ఇబ్బంది తెచ్చే పరిస్థితి కల్పించవద్దని జానారెడ్డి తెలిపారు.