హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ యువకుడు 'మ్యాన్ వర్సెస్ వైల్డ్ హైదరాబాద్ వెర్షన్' పేరుతో ఏకంగా బతికున్న పామునే తింటూ వీడియో తీసుకున్నాడు. తొలుత పాము పిల్ల తలను నోట్లో పెట్టుకున్న యువకుడు.. కొంచెం కొంచెంగా తోక చివరి వరకు నమిలి మింగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పాపం.. ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ పాము మెలికలు తిరుగుతూ గిలగిల్లాడింది. 'అరేయ్ సాజిద్.. నీళ్ల బాటిల్ తీసుకురా..!' అంటూ ఆ యువకుడు మిత్రులను ఆదేశించడం వీడియోలో వినిపిస్తోంది. ఈ దారుణంపై జంతుప్రేమికులు తీవ్రంగా మండిపడుతున్నారు. సదరు యువకుడిని వెంటనే పట్టుకుని శిక్షించాలని డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు.