వివాహేతర సంబంధానికి బాలుడు అడ్డు.. ఆ క్రూరుడు ఏం చేశాడంటే..?

మంగళవారం, 30 మార్చి 2021 (14:15 IST)
భర్తకు దూరంగా వుంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఓ మహిళ వివాహేతర సంబంధం ఆ బాలుడిని బలిగొంది. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న పనిచేసే చోట పరిచయమైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఆమెకు బాబు ఉండటం అతనికి నచ్చలేదు. ఈ క్రమంలోనే బాలుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే..  గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడుకు చెందిన లక్ష్మికి పదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన తుపాకుల శ్రీనుతో వివాహం జరిగింది. వారికి జన్మించిన బాబుకు సాయికల్యాణ్ అని పేరు పెట్టారు. అయితే కొడుకు పుట్టిన రెండేళ్ల తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే లక్ష్మీ తన కుమారుడు, తల్లితో కలిసి వేరే ఇంట్లో అద్దెకు నివాసం ఉంది. 
 
ఇల్లు గడవడం కోసం దాచేపల్లి మండలంలోని కేసనపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయశాఖలో ఐసీఆర్పీగా పనిచేసింది. ఆ సమయంలో ఆమెకు తెలంగాణలోని నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం రంగంగుంట్ల గ్రామానికి జనారెడ్డితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో లక్ష్మి, జనారెడ్డిలు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉన్నారు. సాయికల్యాణ్ మాత్రం అమ్మమ్మ కృష్ణవేణి వద్దే ఉంటున్నాడు.
 
ఇక, లక్ష్మి కొన్ని రోజులు మిర్యాలగూడలో, మరికొన్ని రోజులు దాచేపల్లి వెళ్లి కొడుకు వద్ద ఉండేది. అయితే లక్ష్మి దాచేపల్లికి వెళ్లడం జానారెడ్డికి నచ్చలేదు. ఈ క్రమంలోనే కుమారుడిని వదిలి తనవద్దే ఉండాలని లక్ష్మీని కోరాడు. ఆమె ఒప్పుకోక పోవడంతో ఇద్దరినీ చంపుతానని బెదిరించేవాడు. దీంతో లక్ష్మి.. లాక్‌డౌన్‌కు ముందు కుమారునితో కలిసి యర్రగొండపాలెంలోని తన సోదరి వద్దకు చేరింది. తన విధులను కూడా మండలంలోని యాల్లారెడ్డిపల్లెకు మార్పించుకుని అక్క ఇంటి వద్ద అద్దెకు నివాసం ఉంటుంది. ఇక, కొన్ని రోజుల క్రితం ఉద్యోగం వదిలేసిన లక్ష్మీ.. చీరలపై ఎంబ్రాయింగ్‌ చేసి మిర్యాలగూడలో విక్రయిస్తూ జీవనం సాగిస్తుంది.
 
ఇందుకోసం ఆమె మిర్యాలగూడ, యర్రగొండపాలెం ప్రాంతాలకు లక్ష్మి రాకపోకలు సాగిస్తోంది. మరోవైపు జానారెడ్డి మాత్రం లక్ష్మిని బెదిరిస్తూనే ఉన్నాడు. కుమారుడి అడ్డు తొలగిస్తే తప్ప.. లక్ష్మీ తన వద్దకు రాదని జానారెడ్డి భావించాడు. సాయికల్యాణ్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తన బంధువైన బ్రహ్మారెడ్డి సాయం కోరాడు. అతడి సాయంతో బాలుడిని కిడ్నాప్ చేసి.. హత్య చేశారు. ఈ సంఘటనపై ఈ నెల 24న పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో మార్కాపురం డీఎస్పీ కిశోర్‌కుమార్‌ పర్యవేక్షణలో సీఐ దేవప్రభాకర్‌ దర్యాప్తు కేసు దర్యాప్తు చేపట్టారు. బాలుడిని హత్య చేసిన నిందితులు జానారెడ్డి, బ్రహ్మారెడ్డిలను అరెస్ట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు