అనంతరం యువతులను స్కూటీ మీద ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లేవాడు. అక్కడ వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. అనంతరం వారి దగ్గర ఉన్న బంగారం దోచుకుని వెళ్లేవాడు. మొత్తం హుస్సేన్‌పై 17 కేసులు నమోదయ్యాయి. దరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్స్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. హుస్సేన్‌పై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు.
అలాగే హుస్సేన్‌కు న్యాయస్థానంలో కఠిన శిక్షలు పడేలా చూస్తామని సీపీ మహేష్ భగవత్ పేర్కొన్నారు. ఇక, అరెస్ట్ అయిన హుస్సేన్ ఖాన్ వద్ద నుంచి 90 గ్రాముల బంగారం, 45వేల నగదు, మొబైల్ ఫోన్, హోండా యాక్టీవ్ బైక్ సీజ్ చేశామని వెల్లడించారు.