నందిగామ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. నందిగామ మండలం జంగోనిగూడ గ్రామానికి చెందిన శ్రీధర్ (55), పఠాన్ చెరువు మున్సిపాలిటీకి చెందిన సురేష్ కుమార్ (30)లు ఈ ప్రమాదంలో మృతి చెందారు.
వీళ్లు అయ్యప్పటెంపుల్ సమీపంలోకి వచ్చేసరికి.. షాద్ నగర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక లారీ అతివేగంగా వచ్చి రోడ్డు పక్కనే ఉన్న వేప చెట్టుకు ఢీకొని, ఆ పక్కనే బైకుపై ఉన్న శ్రీధర్, సురేష్ కుమార్‌లను కూడా ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.