సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 65 ఏళ్ల ఏడ్ల నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం జీ ఓ 36ను విడుదల చేసింది. సంబంధిత ప్రక్రియను తక్షణమే ప్రారంభించి, అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు అందించాలని అందులో సేర్ప్ సీఈఓ ఇతర అధికారులను ఆదేశించింది.
ఈ నిర్ణయంతో కొత్తగా లక్షలాది మందికి ప్రతినెలా రూ. 2016/- వృద్ధాప్య పెన్షన్ అందనున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ మేరకు తమ శాఖ అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 65 ఏ0డ్లు నిండిన అర్హత ఉన్న వాళ్ళందరికీ దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. వృద్ధాప్య పెన్షన్ల కు వయోపరిమితిని తగ్గిస్తూ జీ ఓ జారీ చేసిందులకు మంత్రి సిఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.