సభ్య సమాజం తలదించుకునేలా తల్లిదండ్రులు ప్రవర్తించారు. తల్లిదండ్రులు అనే పేరుకు మాయని మచ్చతెచ్చేలా నడుచుకున్నారు. తాజాగా అలాంటి అమానుష ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కుషాయిగూడలో అప్పుడే పుట్టిన పాపను అపార్ట్‌మెంట్‌పై నుంచి గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ పాపను చేరదీసి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పై నుంచి కిందకి పడివేయడంతో ఆ శిశువు తలకు సిమెంట్ కాంక్రీట్ గుచ్చుకున్నాయి. పసికందును గాయలతో ఉన్న స్థితిలో చూసిన కుషాయిగూడ ఎస్సై సాయికుమార్ చలించిపోయారు.
పాపను తనచేతుల్లోకి తీసుకుని వెంటనే వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 318 (మృతదేహాన్ని రహస్యంగా పారవేయడం ద్వారా పుట్టుకను దాచడం) కింద కేసు నమోదు చేయబడినప్పటికీ, శిశువును విడిచిపెట్టిన తల్లిదండ్రులు లేదా వ్యక్తుల గురించి పోలీసులకు ఇంకా తెలియరాలేదు.