విపరీతమైన ప్రసవ వేదనకు గురైన ఆ గిరిజన మహిళ కుటుంబ సాయంతో డోలీ కట్టి ఆస్పత్రికి చేరింది.ఆమె కుటుంబానికి చెందిన ఇద్దరు పురుషులు ఆమెను డోలీ ద్వారా అటవీ ప్రాంతం గుండా తీసుకువెళ్లి సమీప వైద్య సదుపాయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు.
దాదాపు 20 కిలోమీటర్ల మేర ఆమెను భుజాలపై ఎక్కించుకుని సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మహిళను ఆరోగ్య కేంద్రం నుంచి అంబులెన్స్‌లో భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారని, త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని అధికారులు తెలిపారు.