సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పిన బాలయ్య.. ఎందుకో తెలుసా?

శనివారం, 5 సెప్టెంబరు 2020 (14:28 IST)
కోట్లాది మంది ఆరాధ్యదైయం, ఆంధ్రుల ఆరాధ్యదైవమైన స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఇక జీవిత పాఠ్యాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన జీవిత చరిత్రను ఓ పాఠ్యాంశంగా చేర్చింది. పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఒక పాఠ్యాంశాన్ని పెట్టించారు. సోషల్ స్టడీస్‌లో పేజీ నంబర్ 268లో ఎన్టీఆర్‌కు సంబంధించిన కీలక అంశాలను పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో పెట్టడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
మరోపక్క, తన తండ్రి జీవితాన్ని గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా పాఠ్య పుస్తకంలో ప్రచురించడం పట్ల నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఫేస్ బుక్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.  
 
నిజానికి స్వర్గీయ ఎన్.టి.ఆర్ ఎంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి ఎనలేని అభిమానం. అందుకే ఎన్టీఆర్ 'ఒక్క మగాడు' అంటూ పలు సందర్భాల్లో కేసీఆర్ అన్నారు. అంతేకాదు, ఎన్టీఆర్ మీద అభిమానంతో తన తనయుడికి తారకరామారావు అని పేరు కూడా పెట్టుకున్నారు. ఇపుడు తెలంగాణ పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఓ పాఠ్యాంశంగా చేర్చి ఆయన పట్ల తనకున్న అభిమానాన్ని మరోమారు చాటారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు