ఘటనపై పోలీసులు ఆరా తీసి ఆమెను ఖమ్మం జిల్లా కారేపల్లి(సింగరేణి) మండల పరిధి బద్యాతండావాసిగా గుర్తించారు. కాగా మృతురాలు తనను కుమారులు పట్టించుకోవడం లేదని, తనది కారెపల్లి అని చెబుతూ మూడు రోజులుగా ట్రాక్ వెంట తిరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి 11-12గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చంపి, శరీర భాగాలను ముక్కలుగా చేసి గోనె సంచిలో మొండెం భాగాన్ని తెచ్చి ట్రాక్ మధ్యలో వదిలి వెళ్లారు.
మృతురాలికి ముగ్గురు కుమారులుండగా భర్త ఇదివరకే చనిపోయాడు. రైల్వే డీఎస్పీ చంద్రభాను, ఖమ్మం రైల్వే ఎస్సై రవికుమార్ ఆదేశాల మేరకు డోర్నకల్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఆళ్ల సత్యనారాయణరెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.