హైదరాబాద్‌లో రూ.91 దాటిన పెట్రోల్‌ ధర

బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (12:48 IST)
దేశంలో ఇంధన ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. వరుసగా రెండో రోజు చమురు ధరలు పెరిగి కొత్త గరిష్ఠాలను తాకాయి. బుధవారం పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెరిగింది.

దీంతో దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 87.60కి చేరింది. డీజిల్‌ ధర రూ. 77.73గా ఉంది. హైదరాబాద్‌లోనూ చమురు ధరలు 
ఆకాశన్నంటుతున్నాయి. నగరంలో బుధవారం లీటర్‌ పెట్రోల్‌ ధర 31 పైసలు పెరిగి రూ. 91.09కి చేరింది. డీజిల్‌ ధర రూ. 84.79 గా ఉంది.
 
ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్‌ ధర అత్యధికంగా రూ. 94.12కు చేరింది. కోల్‌కతాలో రూ. 88.92, చెన్నైలో రూ. 89.96గా ఉంది. 
 
డీజిల్ ధర ముంబయిలో రూ. 84.63, కోల్‌కతాలో రూ. 81.31, చెన్నైలో రూ. 82.90గా ఉంది. అంతర్జాతీయ ధరలు, విదేశీ మారక ధరల ఆధారంగా దేశీయ చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రోజువారీగా సవరిస్తుంటాయి.
 
అయితే వ్యాట్‌, ఇతర పన్నులతో వీటి ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. తాజాగా అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయంగానూ ఇంధన ధరలు పెరిగాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు