తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, బతుకులు బాగుపడతాయని అనుకుంటే.. భూములు లాక్కొని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని నల్గొండ జిల్లాను ఈ విధంగానే పాడుచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల పొలాలు వారికే చెందాలి.. వాళ్ల హక్కులు కాపాడాలనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చిందని.. ఆ మాటలకు పార్టీ కట్టుబడి ఉందన్నారు. మరో మూడేళ్ల పాటు భూములను కాపాడుకోవాలని.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ సమస్యా ఉండదన్నారు. అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్ లాంటివి లేకుండా ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు.