తెలంగాణ సర్కారు విందుకు మోడీ - ఇవాంకా గైర్హాజరు (Video)

సోమవారం, 27 నవంబరు 2017 (19:14 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. ఈనెల 28వ తేదీన ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరై ప్రారంభించనున్నారు. 
 
ఈ సందర్భంగా 29వ తేదీన గోల్కొండ హోటల్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విందును ఏర్పాటుచేసింది. దీనికి ప్రధాని మోడీ, ఇవాంకాలు గైర్హాజరుకానున్నారు. కానీ, 28వ తేదీన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఇచ్చే విందుకు మాత్రం వారిద్దరూ హాజరవుతున్నారు. ఈ విందులో 30 రకాల వంటకాలను సిద్ధం చేసి వడ్డించనున్నారట. వీరు విందు ఆరగించే టేబుల్ ప్రపంచంలోనే అతిపెద్దది కావడం గమనార్హం. 
 
మరోవైపు, ఈ శిఖరాగ్ర సదస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం డబ్బును మంచినీటి ప్రాయంగా ఖర్చు చేస్తోంది. కేవలం రెండు రోజుల సదస్సు నిర్వహణకు ఏకంగా రూ.8 కోట్లను ఖర్చు చేస్తుందట. ఈ మొత్తం కూడా కేవలం రవాణాకే వెచ్చిస్తోందట. నోవాటెల్ నుంచి హైటెక్స్ ప్రాంగణానికి దూరం కావడానికితోడు, హైటెక్స్ నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు 30 కిలోమీటర్లు, గోల్కొండ కోటకు మరింత దూరం ఉండటంతో రవాణాకు భారీగా ఖర్చు అవుతోందట. 
 
అంతేకాకుండా, హైదరాబాద్ నగరంలోని అన్ని హోటల్స్‌ అతిథులతో నిండిపోనున్నాయి. ఇప్పటికే విదేశీ అతిథులు ఉండేందుకు 287 గదులున్న నోవా‌టెల్ హోటల్‌ మొత్తాన్ని బుక్ చేశారు. ఇదికాకుండా, హైటెక్ సిటీలోని మైండ్ స్పేస్‌లోని వెస్టిన్ హోటెల్, రహేజా ఐటి పార్క్‌లోని హోటల్స్‌లోని గదులను రిజర్వు చేసినట్టు సమాచారం. 


 

PM Modi to host Ivanka Trump in world's largest dining hall at Hyderabad's Falaknuma Palace https://t.co/pXg7lived2 pic.twitter.com/o8jS66zBWn

— NDTV (@ndtv) November 25, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు