తెలంగాణ ఆర్టీసీ బస్సులో మోదీ!

శుక్రవారం, 23 ఆగస్టు 2019 (14:45 IST)
ఆదిలాబాద్‌: ప్రధానమంత్రి మోదీ ఆర్టీసీ బస్సు ఎక్కి తనిఖీ చేస్తున్నారనుకుంటే పప్పులో కాలేసినట్లే. అచ్చం ప్రధాని రూపురేఖలతో ఉన్న ఈయన షేక్‌ అయ్యూబ్‌. ఆదిలాబాద్‌ బొక్కలగూడకు చెందినవారు. ఆర్టీసీలో బస్సు డ్రయివర్‌గా పనిచేస్తున్నారు. 
 
జుట్టు, ముఖ కవళికలు, నడక అన్నీ మోదీలా ఉన్న ఈయనతో పలువురు స్వీయచిత్రాలు తీసుకుంటూ ఉంటారు. మోదీ బయోపిక్‌ తీయడానికి ఓ సినీ దర్శకుడు కూడా ఈయనను సంప్రదించారట. మోదీని ఒక్కసారైనా కలవాలని ఉందని షేక్‌ అయ్యూబ్‌ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు