కార్పొరేట్ ఆస్పత్రుల్లో నిలిచిన ఆరోగ్య వైద్య సేవలు

శుక్రవారం, 16 ఆగస్టు 2019 (13:14 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. పాత బకాయిలు చెల్లించాలని కార్పొరేట్ ఆస్పత్రి యజమానులు డిమాండ్ చేస్తూ, ప్రభుత్వ బకాయిలు చెల్లించేంతవరకు ఆరోగ్య శ్రీ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చర్చలకు ఆహ్వానించింది.
 
తెలంగాణ వ్యాప్తంగా కార్పొరేట్, 240 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అర్థరాత్రి నుంచి నిలిచిపోయాయి. ఈహెచ్‌ఎస్‌, జేహెచ్‌ఎస్‌ వైద్య సేవలు సైతం నిలిపివేస్తున్నట్లు యాజమాన్య సంస్థలు ప్రకటించాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించనందునే నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రులు ప్రకటించాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు