యూరో ఫెల్డీటే కుటుంబానికి చెందిన యూరోఫెల్డ్సీ ఎల్ఎటి దీని శాస్త్రీయనామం అన్ని చెప్పారు. ఈ జాతి పాము నల్లమలలో ఉండటం ఈ ప్రాంతానికి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చన్నారు. షీల్డ్టెయిల్స్ హానిచేయనివి, ప్రాచీనమైనవి అని చెప్పారు.
ఇవి 25-50 సెం.మీ పొడవు వరకు పెరుగుతాయని, పాములు తమ సొంత సొరంగాలను తవ్వి భూగర్భంలో నివసిస్తాయని అన్నారు. ఇవి భూమిలో సొరంగాలు తవ్వుకొని నివశిస్తాయని, ఆహారం కోసం రాత్రి సమయంలో మాత్రమే బయటకు వస్తాయని తెలిపారు.