హైదరాబాద్ నగరానికి 50 నుంచి 70 కి.మీల దూరంలో, ఓఆర్‌ఆర్‌కి 30కి.మీల దూరంలో ఈ రహదారి నిర్మాణం జరగనుంది. సుమారు 20కి పైగా ముఖ్య నగరాలు/పట్టణాలను కలుపుతూ నిర్మాణం జరగనున్న ఈ రహదారితో రాష్ట్రంలోని 40శాతం మంది ప్రజలకు రింగ్ రోడ్డు ఉపయుక్తంగా ఉండనుంది.
మొదటి దశలో సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 158 కి.మీల మేర నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. రూ.9,522 కోట్లు నిర్మాణ వ్యయంగా నిర్ణయించారు. రెండో దశలో చౌటుప్పల్ - సంగారెడ్డి మధ్య 182 కి.మీల మేర నిర్మాణం చేపట్టనున్నారు.
తెలంగాణ అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చే ఈ అపురూప ప్రాజెక్టును కేంద్రం రెండు పార్ట్‌లుగా నిర్వహించబోతోందన్నారు. రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, నితిన్ గడ్కరీలకు కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.