దీంతో కొత్త పీసీసీ సారథి కోసం కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేపట్టింది. అయితే, ఈ పదవికి అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ కూడా చేస్తున్నారు.
ఇప్పటివరకు పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఏఐసీసీలోకి తీసుకోనుండగా, సంపత్ కుమార్‌ను ఎస్సీ కోటాలో, మధుయాష్కీ గౌడ్‌ను బీసీ కోటాలో, మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించనున్నట్టు తెలుస్తోంది.
అలాగే, టీపీసీసీ చీఫ్ రేసులో చివరి వరకు ఉన్న ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును సీఎల్పీ నేతగా నియమించనున్నట్టు సమాచారం. కోమటిరెడ్డి కనుక ప్రచార కమిటీ పదవిని ఆశిస్తే కనుక భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా కొనసాగించి, శ్రీధర్ బాబును కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కానీ, లేదంటే ఏఐసీసీలోకి కానీ తీసుకోవాలని అధిష్ఠానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.