ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ భవిష్యత్ ప్రయోజనాల కోసమే రాజీనామా చేశానన్నారు. పార్టీలో పదవి లేకపోయినా కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేస్తానని రేవంత్ స్పష్టంచేశారు. యువరాజు రాహుల్ స్ఫూర్తితో రాజీనామా చేస్తున్నట్టు రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆపరేషన్ కమలం ప్రారంభించింది. ఇందులోభాగంగా పలువురు ఓ రాజ్యసభ సభ్యుడుతో పాటు.. పలువురు టీడీపీ సీనియర్ నేతలు పార్టీలో చేరారు. అలాగే, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక నేతల నేతలపై బీజేపీ దృష్టిసారించింది.
అలాగే, రేవంత్ రెడ్డితో కూడా బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ఇదే విషయంపై పలువురు నేతలు రేవంత్‌తో చర్చలు జరిపినట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.