ఆర్టీసీ సమ్మె.. అందినంత దోచేయ్ గురూ...

బుధవారం, 6 నవంబరు 2019 (12:52 IST)
ప్రైవేటు ఉద్యోగుల చేతి వాటం. ఆర్టీసీ సమ్మె మూలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతి పక్కన పెడితే.. ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న ప్రైవేటు ఉద్యోగులు మాత్రం ఇదే అదునుగా తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ అవకతవకలను మాత్రం ఉన్నతాధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.
 
కేవలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపోలో దాదాపు రోజువారీగా 10 నుండి 20 వేల మధ్యల అధికారులు పంచుకున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. మంగళవారం  రాత్రి తాత్కాలిక అకౌంటెంట్ తప్పుగా తక్కువగా లెక్కలు రాసి బస్ డిపో నుండి డబ్బులు తీసుకు పోయే ప్రయత్నంలో  సెక్రటరీ అధికారులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు  అప్పగించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు