చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన రజినీకి సినిమాలంటే పిచ్చి ప్రేమ. సీరియళ్ళలోనైనా, సినిమాలోనైనా నటించాలనుకునేది రజిని. దీంతో తల్లిదండ్రులను ఒప్పించి హైదరాబాద్‌కు వచ్చేసింది. కూకట్‌పల్లిలో ఒక లేడీస్ హాస్టల్‌లో ఉండేది.
నెలరోజుల పాటు కొంతమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లను కలిసింది. అయితే ఆమెకు అవకాశాలు మాత్రం ఎవ్వరూ ఇవ్వలేదు. మదనపల్లిలో తనతో పాటు చదువుకున్న అనామిక సహాయంతో ఒక చిన్న ప్రొడ్యూసర్‌ను కలిసింది. ఆయన పేరు రామరాజు. చిన్నపాటి సీరియళ్ళు చేసేవాడు. అది కూడా యు ట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేవాడు. ముందుగా ఈ అవకాశంతో తన టాలెంట్‌ను నిరూపించుకుని ఆ తరువాత బుల్లితెరపైకి వెళదామని నిర్ణయించుకుంది రజిని.
తనను పెళ్ళి చేసుకోమని అవినాష్‌ను ప్రాధేయపడింది. సీరియళ్ళలో నటిస్తున్న రజినీకి అక్కడున్న వారితో సంబంధం ఉంటుందని అనుమానించాడు అవినాష్. ఆమెపై లేని పోని ఆరోపణలు చేశాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. చివరకు తీవ్ర ఆవేశంలో రజినీని గొంతు నులిమి చంపేశాడు అవినాష్. కూకట్‌పల్లి పోలీస్టేషన్‌కు వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పి లొంగిపోయాడు.