మంచిర్యాల : మాజీ ఎంపీటీసీ శోభాదేవితో పాటు భర్త మృతి
బుధవారం, 9 మార్చి 2022 (14:47 IST)
మంచిర్యాల ఘోర రోడ్డు ప్రమాదంలో జన్నారం మాజీ ఎంపీటీసీ శోభాదేవితో పాటు ఆమె భర్త మురళీధర్ ప్రాణాలు కోల్పోయారు. జన్నారం మండలం ఇందన్‌పల్లి వద్ద వారు ప్రయాణిస్తోన్న కారు చెట్టును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అధిక వేగంతో కారు నడిపిన కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు చెప్తున్నారు.