దసరా సెలవుల కోసం తమ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. జంట నగరాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు దసరా స్పెషల్ పేరుతో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు ప్రకటించింది. ఈ రైళ్లు కూడా శుక్రవారం నుంచే అందుబాటులో ఉంటాయని తెలిపింది. అలాగే, రోజువారీగా నడిచే రైళ్లలో కొన్నింటి సమయాల్లో సవరణలు చేయడం జరిగిందని, అందువల్ల ప్రయాణికులు ఇంటి నుంచి బయలుదేరేముందు విచారించుకుని స్టేషన్‌కు రావాలని ద.మ.రై అధికారులు తెలిపారు.
అలాగే, అక్టోబరు రెండో తేదీన సికింద్రాబాద్ - షాలిమార్‌ల మధ్య 07741 నంబరుతోను, అక్టోబరు 3వ తేదీన షాలిమార్ - సికింద్రాబాద్‌ల మధ్య 07742 నంబరుతో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు పేర్కొంది.
అక్టోబరు, 1, 8 తేదీల్లో కూడా నాందేడ్ - బర్హంపూర్ (07431), త్రివేండ్రం - టాటా నగర్ (06192), అక్టోబరు 2, 9 తేదీల్లో బర్హంపూర్ - నాందేడ్ (07432), అక్టోబరు 4, 11 తేదీల్లో టాటా నగర్ - త్రివేండ్ర (06191) మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేలా చర్యలు తీసుకున్నట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.