బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు సంప్రదాయంగా బలిచ్చే గొర్రెలు-మేకలు, ఇతర జంతువులను రవాణా చేసే వ్యాపారులు, వాహనదారులను వేధింపులకు గురి చేయకుండా పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.
బలి చేసేందుకు రాష్ట్రంలోని పొరుగు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు, పెంపుకందారులు విక్రయించేందుకు హైదరాబాద్‌తో పాటు ఆయా ప్రాంతాల్లోని నగరాలు, పట్టణ ప్రాంతాలకు వాహనాల్లో తరలిస్తుండగా కొంత మంది దాడులు చేసి బీభత్స పరిస్థితులను సృష్టించి, పోలీస్ స్టేషన్లకు అప్పగించడంతో పోలీసులు కేసులునమోదు చేస్తున్నారని ఆయన వివరించారు. ఇలాంటి సంఘటలనకు ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.