మిర్యాలగూడ సాగర్ రోడ్డులో ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేయాలని అమృత కోరడం.. విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ అనేక సంఘాలు నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే వెంకటరమణారావు అనే వ్యక్తి ప్రణయ్ విగ్రహ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని హైకోర్టును ఆశ్రయించడంతో విగ్రహం ఏర్పాటు చేయడంపై ఎలాంటి పనులను చేపట్టరాదని హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.
అదేవిధంగా ప్రణయ్ విగ్రహ ఏర్పాటులో కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసి ప్రణయ్ తండ్రికి నోటీస్‌లు ఇవ్వాలని సూచించింది. ఇందుకు సంబంధించిన అధికారులు వచ్చే నెల 23వ తేదీన కోర్టుకు హాజరు కావాలని కోరింది. విగ్రహం ఏర్పాటు చేయాలంటే అన్ని శాఖల అధికారుల అనుమతులు తీసుకోవాలని ఆదేశించింది.