ప్రస్తుతం కృష్ణానది నీటిమట్టం లాంచీల ప్రయాణానికి అనుకూలంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పర్యాటక శాఖ అధికారులు పేర్కొన్నారు. కృష్ణా నదిలో విహారయాత్రలకు సంబంధించి పలు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ - శ్రీశైలం - సోమశిల యాత్రకు ఒక్కొక్కరికి రూ.3,999 చొప్పున వసూలు చేస్తారు.
ఇది కేవలం రెండు రోజుల ప్యాకేజీ మాత్రమే. ఇందులో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు కూడా ఉన్నాయి. రెండో ప్యాకేజీలో హైదరాబాద్ - శ్రీశైలం - నాగార్జునసాగర్ యాత్ర. గతంలో ఈ యాత్ర శ్రీశైలం నుంచి సాగర్ వరకు ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నారు.
ఈ రెండు యాత్రలు ఉదయం ఏడు గంటల సమయంలోనే ప్రారంభం అవుతాయి. ఈ ప్యాకేజీ ధర కూడా రూ. 3,999 మాత్రమే. ప్రతి శనివారం యాత్రలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి వారంలో మూడు ట్రిప్పులు వేస్తారు. ఈ యాత్రలు ప్రతి శనివారం యాత్రలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి వారంలో మూడు ట్రిప్పులు వేస్తారు.