కేసీఆర్ ఏడేళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన ప్రగతి ఏమీ లేదని, అయితే అవినీతిలో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా అవతరించిందని మాజీ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని తాను త్వరలోనే బయట పెడతానని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు.
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోసం కేసీఆర్ చేసింది ఏమీ లేదు. ఏదైనా చేశారంటే రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ అవినీతి రాష్ట్రంగా మార్చారు. 7 ఏళ్ల కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను 7 నెలల్లో ప్రజలకు చూపిస్తాను. సర్కార్ వైఫల్యాలు బయట పెట్టేందుకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సద్భావన యాత్ర చేస్తాను. జన సేవ సంఘ్ స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో రాజకీయేతర ఉద్యమం కొనసాగిస్తాను అని వీకే సింగ్ అన్నారు.