ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోంది: బండి సంజయ్‌

సోమవారం, 4 జనవరి 2021 (15:57 IST)
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో విగ్రహాల ధ్వంసం ఘటనలపై తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించారు. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని వ్యాఖ్యానించారు. హిందువుల కానుకలను దేవదాయశాఖ దారి మళ్లీస్తోందని ఆరోపించారు.
 
రాష్ట్ర ప్రజల సహనాన్ని పిరికితనంగా సీఎం జగన్‌ భావించొద్దని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో భాజపా గెలుస్తుందని, తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ షాక్‌ ట్రీట్‌మెంట్‌ తప్పదని జోస్యం చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికలో ఓటేసే ముందు ప్రజలు ఆలోచించాలని బండి సంజయ్‌ కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు