తెరాస పార్టీ జిల్లా అధ్యక్షులు నియామకం.. సీఎం కేసీఆర్ ప్రకటన

బుధవారం, 26 జనవరి 2022 (13:19 IST)
తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస పార్టీకి సంబంధించి జిల్లాల అధ్యక్షులను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ జాబితాను విడుదల చేశారు. మొత్తం 19 మంది ఎమ్మెల్యేలను పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమించారు. అలాగే ముగ్గురు ఎంపీలు, ముగ్గురు జెడ్పీటీసీలు, ఇద్దరు ఎమ్మెల్సీలకు కూడా పార్టీ జిల్లా సారథ్య బాధ్యతలను కూడా అప్పగించారు. ఆ జిల్లాల వివరాలను పరిశీలిస్తే, 
 
ఆదిలాబాద్ : జోగురామన్న, ఆసిఫాబాద్ : కోనప్ప, మంచిర్యాల : బాల్కసుమన్, నిర్మల్ : విఠల్ రెడ్డి, నిజామాబాద్ : జీవన్ రెడ్డి, కామారెడ్డి : ముజీబుద్దీన్, కరీంనగర్ : రామకృష్ణారావు, సిరిసిల్ల : తోట ఆగయ్య, జగిత్యాల : విద్యాసాగర్ రావు, పెద్దపల్లి : కోరుకంటి ప్రభాకర్, సిద్ధిపేట : కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ : పద్మా దేవేందర్ రెడ్డి, సంగారెడ్డి : చింతా ప్రభాకర్, వరంగల్ : ఆరూరి రమేష్, హన్మకొండ : వినయ్ భాస్కర్, జనగామ : సంపత్ రెడ్డి, మహబూబాబాద్ : మాలోతు కవిత, ములుగు : కుసుమ జగదీష్, భూపాలపల్లి : గండ్ర జ్యోతి, ఖమ్మం : తాతా మధుసూదన్, భద్రాద్రి : రేగా కాంతారావు, నల్గొండ : రవీంద్రనాథ్ నాయక్, సూర్యాపేట: లింగయ్య యాదవ్, యాదాద్రి : కంచర్ల రామకృష్ణారెడ్డి, రంగారెడ్డి : మంచిరెడ్డి కిషన్ రెడ్డి, వికారాబాద్ : మెతుకు ఆనంద్, మేడ్చల్ : శంభీపూర్ రాజు, మహబూబ్ నగర్ : లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ : గువ్వల బాలరాజు, గద్వాల : కృష్ణమోహన్ రెడ్డి, నారాయణ పేట : రాజేందర్ రెడ్డి, వనపర్తి : గట్టు యాదవ్, హైదరాబాద్ : మాగంటి గోపీనాథ్. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు