అంతేకాదు... గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్‌తో కలిసి కోదండరామ్ ఆ పార్టీకి మేనిఫెస్టో రాసిండనీ, ఆ పార్టీ ఏమైందో అందరికీ తెలుసని చెప్పారు. అంతెందుకు చిరంజీవి పార్టీ పెడితే ప్రజలు ఆ పార్టీని ఏం చేసిండ్రు... ఆ పార్టీని కట్టెల మోపును కింద పడేసినట్లు పడేయలేదా అంటూ ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్ ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టారంటే ఆయనకు జనంలో ఎంతో విశ్వసనీయత వున్నదనీ, అందువల్ల ఆయన మనగలిగారని చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలపై కోదండరామ్ స్పందించేందుకు నిరాకరించారు. ఆయన వ్యాఖ్యలపై రేపు టి.జేఏసి సమావేశంలో చర్చిస్తామని వెల్లడించారు.